Friday, 31 July 2026 09:17:33 AM
# మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్

జర్నలిస్టులకు ఎన్నికల తాయిలాలు ప్యాంటు, షర్టు చీరా జాకెట్ పంపిణీ..

జర్నలిస్టులకు ఎన్నికల తాయిలాలు ప్యాంటు, షర్టు చీరా జాకెట్ పంపిణీ..

Date : 15 February 2024 07:38 AM Views : 226

Rapid TV - Andhra Pradesh / Anakapally : గత ప్రభుత్వాలు మంజూరు చేసిన అక్రిడేషనలో కోత విధించి, ప్రశ్నించిన గొంతుకులపై భౌతిక దాడులకు పాల్పడుతూ ఇంత వరకు నిరక్ష్యం చేసిన జర్నిలిసులను ప్రసన్నం చేసుకునేందుకు అధికార ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అందరి అవసరం ఉంటుందని భావించిన నేతలు పథకాల మాదిరిగానే పంపిణీకి తెరలేపింది. వీటిని సైతం కొన్ని సంసలకే పరిమితం చేస్తూ, క్షేత్రసాయి మీడియాలో పని చేస్తున్న వారిని విస్మరించి, కోతలు విధించారు. ఈ పథకం వల ప్రసన్నం అనే మాట పక్కనపెడితే చివరకు కొంప ముంచుతుందనే భావనలో అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ విషయం తెలిసిన ఒక ప్రముఖ మీడియా సంస తాయిలాలు తీసుకోవద్దని ఇప్పటికే తమ జర్నలిస్టులకు ఆదేశించడం విశేషం. *రాపిడ్ టీవీ ప్రతినిధి, నర్సీపట్నం*: ఇతర రాష్ట్రాలు, గత ప్రభుత్వాలతో పోలిస్తే ప్రస్తుతం జర్నిలిస్టులను నిరాశపరిచిన ఘటనలే ఉన్నాయి. వీరికి ఇళ్ల స్థలాలు ఇతర లబ్ధి పక్కన పెడితే అక్రిడేషన్లు సైతం పూర్తి స్థాయిలో పంపిణీకి నోచుకోలేదు. చిన్న పేపర్లకు కుంటి సాకులు చెప్పి గతంలో ఎన్నడూ లేనివిధంగా అక్రిడేషన్లలో కోతలు విధించింది. ఎంపిక చేసిన వారికి సైతం కొత్త నిబంధనల పేరుతో నిర్ణీత సమయాల్లో పంపిణీ విషయాన్ని పక్కన పెట్టి, నెలల తరబడి బస్సు సదుపాయాలకు దూరం చేసింది. దాదాపుగా అధికారం చేపట్టిన నాటి నుంచి జర్నలిస్టులను ఇబ్బందులకు గురి చేసిన ప్రభుత్వం, బతికుండగానే కోడి వెంట్రుకలు తీసి, నూకలు చల్లే మాదిరిగా తాయిలాలకు తెర లేపింది. నియోజకవర్గ స్థాయిలో ఉన్న విలేకర్లకు ఒక్కొక్కరికి ప్యాంటు, షర్టుతో పాటు చీర పంపిణీ చేసేందుకు నిర్ణయించారు. అందుకు గాను సంబంధిత ఎమ్మెల్యే నియోజకవర్గంలో పని చేస్తున్న విలేకరుల పేర్లను సేకరించి, ప్రభుత్వ పెద్దలకు పంపిస్తే దానికి అనుగుణంగా తాయిలాలు పంపేలా ఏర్పాట్లు చేశారు. అయితే, విలేకర్ల ఎంపికలో కూడా పరిమితులు విధించారు. వీటిని సైతం ప్రధాన మీడియాకే పరిమితం చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ అనుకూల మీడియా ప్రతినిధులు చెప్పిన వారికే ఈ తాయలాలు కూడా పంపిణీ చేయడం గమనార్హం. ప్రస్తుతం ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియా విస్తరించిన నేపథ్యంలో నియోజకవర్గ స్థాయిలో యూట్యూబర్లు సైతం పెరుగుతూ వచ్చారు. కొన్ని నియోజకవర్గాల్లో వీరి సంఖ్య కాస్త అధికంగా ఉండటంతో కోతలు విధించారు. ఇంత వరకు బాగానే ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ మీడియా సంస్థ తమ విలేకరులను ప్రభుత్వం పంపిణీ చేసే తాయిలాలకు దూరంగా ఉండాలంటూ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది.. ప్రస్తుతం ప్రధాన మీడియా పరిస్థితి మరీ వింతగా ఉంటుంది. యాజమాన్యాలు చెప్పినట్లు వార్తలు ఇవ్వాలే తప్ప, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవినీతి తదితర విషయాలపై వార్తలు ఇచ్చినా ప్రచురించే పరిస్థితి లేదు. ఎలక్ట్రానిక్ మీడియాలో సైతం ఇదే వింత పరిస్థితి. అయితే, ఇటీవల సోషల్ మీడియా వేదికగా కొత్తగా తెరపైకి వచ్చిన యూ ట్యూబర్లు ఏ విషయం జరిగినా.. నిమిషాల్లో ప్రజలకు చేరవేస్తున్నారు. అందుకే, నియోజకవర్గ స్థాయి నాయకులు సైతం ఇలాంటి వారినే పక్కన పెట్టుకుని ప్రధాన మీడియాను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్న తరుణంలో తాయిలాల పంపిణీలో కేవలం ప్రధాన మీడియా ప్రాధాన్యత ఇచ్చి, యూ ట్యూబర్లను పక్కన పెట్టడం విచారకరమని వివిధ సంఘాల నేతలు పెదవి విరుస్తున్నారు. ఇప్పటి వరకు జర్నిలిస్టులను దూరం పెట్టిన ప్రభుత్వం, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాయిలాల ఎర ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే, అకస్మాత్తుగా తీసుకున్న ఈ పథకం వల్ల క్షేత్ర స్థాయిలో ఏ మేరకు పని చేస్తుందో వేచి చూడాల్సిందే. *సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ పంపిణీ చేస్తున్నామని స్థానిక నాయకులు చెప్పడం విడ్డూరం..*

L.V.RAMANA NARSIPATNAM

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: