Saturday, 13 June 2026 06:24:57 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

రాష్ట్రవ్యాప్తంగా ఎం ఎస్ ఎం ఈ కేంద్రాలు ఏర్పాటుకే పరిశీలన:: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Date : 19 July 2024 07:37 PM Views : 157

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాష్ట్రవ్యాప్తంగా ఎం ఎస్ ఎం ఈ కేంద్రాలు పెట్టడానికి ప్రతిపాదనలు పరిశీలన,  రాష్ట్ర ఎం ఎస్ ఎం ఈ., సెర్ఫ్., ఎన్ ఆర్ ఐ., ఎమ్పవర్ మెంట్  శాఖల మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్  *అనకాపల్లి, జూలై 19: ఎం ఎస్ ఎం ఈ  శిక్షణా కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా పెట్టడానికి పరిశీలన చేస్తున్నట్లు ఎం ఎస్ ఎం ఈ రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి లో ఏర్పాటు చేసిన ఎం ఎస్ ఎం ఈ శిక్షణా కేంద్రాన్ని శుక్రవారం ఉదయం  మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికులతోనూ శిక్షణ పొందుతున్న విద్యార్థులతోనూ ఎం ఎస్ ఎం ఈ ఉద్యోగులతో ఆయన సమావేశం అయ్యారు. ఎం ఎస్ ఎం ఈ టెక్నాలజీ సెంటర్ విధి విధానాలను అడిగి తెలుసుకున్నారు.* *ఈ సందర్భంగా ముందుగా శిక్షణ కేంద్రంలో ప్రస్తుతం ఉన్న అభివృద్ధి, విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శిక్షణ కేంద్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 15 ఎం.ఎస్.ఎం.ఇ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారని, వాటిలో ఒకటే ఏపీ ఎస్ సి జెడ్ అచ్యుతాపురం లో ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. ఈ శిక్షణా కేంద్రం అద్భుతంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఈ శిక్షణ కేంద్రం 2000 మందితో ప్రారంభించడం జరిగిందని, ప్రస్తుతం 3000 మంది శిక్షణ పొందుతున్నారని మంత్రి తెలిపారు. 5000 మందికి శిక్షణ పెంచాలని ప్రతిపాదన చేస్తున్నట్లు ఆయన చెప్పారు. 8వ తరగతి కనీస విద్యార్ధతో ప్రారంభమై ఎంటెక్ చదివిన వారికి ఈ శిక్షణ సంస్థలో ప్రవేశం జరుగుతుందన్నారు. శిక్షణ పొందిన వారికి ఉపాధి అవకాశాలు చూపెట్టడం జరుగుతుందని చెప్పారు. ఎం ఎస్ ఎం ఈ శిక్షణ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలనే విషయాన్ని చర్చించారు.  ఎస్ ఈ జెడ్ నెలకొల్పిన ఈ శిక్షణా కేంద్రానికి , ఎక్స్టెన్షన్ కేంద్రాలుగా జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయడానికి ఆలోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. తద్వారా ఏ జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు అదే జిల్లాలో అక్కడ అవసరాల బట్టి శిక్షణతో పాటు ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.* ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా  పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీధర్, విశాఖ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ గణపతి, అనకాపల్లి, ఆటోనగర్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :