Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం జడ్పిటిసి మెంబరు తలారి రమణమ్మ ఇటీవలే మృతి చెందారు శనివారం కొత్తకోట లో ఆమె కుటుంబ సభ్యులు దశ దిన కర్మ, సంతాప కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర, చోడవరం మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ రణం ధర్మశ్రీ జిల్లా జడ్పీటీసీల ఫారం సంఘ అధ్యక్షులు దొండా రాంబాబు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ సుభద్ర మాట్లాడుతూ రమణమ్మ భౌతికంగా లేకపోయినప్పటికీ ఆమె యొక్క జ్ఞాపకాలు ఆమె చేసినటువంటి కార్యక్రమాలు చిర స్థాయి gaఉంటాయని అమె లేని లోటు తీర్చలేనిదని అన్నారు. ఈ సందర్భంగా రమణమ్మ భర్త తలారి ఆదిమూర్తికి కుటుంబ సభ్యులకు వారి యొక్క ప్రగాఢ సంతాపం తెలియజేశారు. అనంతరం చోడవరం మాజీ శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీలో మచ్చలేని నాయకురాలుగా అన్ని పార్టీలతో సమయనంతో ఉండేవారని వివాదాలు కు దూరంగా ఉండే రమణమ్మ లేకపోవడం మా పార్టీకి ఎంతో లోటని అన్నారు.. అనంతరం కరణం ధర్మ శ్రీ సతీమణి విజయలక్ష్మి రమణమ్మ చిత్రపటానికి నివాళ అర్పించారు. అనంతరం జిల్లా జడ్పిటిసి ల ఫారం అధ్యక్షులు దొండా రాంబాబు మాట్లాడుతూ ఆమె మృతి మా కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. కార్యక్రమానికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా జడ్పిటిసిలు పలువురు ఎంపీపీలు సర్పంచులు స్థానిక నేతలు హాజరయ్యారు.
Admin
Rapid TV