Thursday, 30 July 2026 08:27:14 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

నర్సీపట్నం ఆర్టీసీ డిపోలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి... స్పీకర్ అయ్యన్నపాత్రుడు

Date : 10 May 2025 09:06 PM Views : 228

Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV నర్సీపట్నం : నర్సీపట్నం ఆర్టీసీ డిపోలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు డిపో యాజమాన్యం తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. నర్సీపట్నం డిపో నుంచి హైదరాబాద్‌తో పాటు కాకినాడకు ఏర్పాటు చేసిన రెండో సర్వీసును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో నర్సీపట్నం నుండి హైదరాబాద్‌కు ప్రత్యేక సర్వీసు ప్రారంభించడం శుభపరిణామమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆకస్మికంగా ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాలను పరిశీలించిన స్పీకర్ రోజూ వేలాది మంది ప్రయాణించే నర్సీపట్నం డిపోలో సౌకర్యాల విషయంలో పెనుభారముందని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, డిపో భవనాల రంగులు పాడవడం వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి నెల డిపోకు అద్దె రూపేణా వచ్చే రూ.7.90 లక్షల ఆదాయాన్ని వినియోగించి ఈ పనులన్నీ తక్షణమే పూర్తి చేయాలని ఆయన సూచించారు. అదేవిధంగా, డిపో ఆవరణలో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఇలాంటి సమస్యలపై సమీక్ష నిర్వహించి, తగిన చర్యలు తీసుకునేలా రీజినల్ చైర్మన్ దొన్నుదొర కృషి చేయాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చింతకాయల రాజేష్, వెలమ సంఘం డైరెక్టర్ సూర్యచంద్ర, అనకాపల్లి డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ కే పద్మావతి, నర్సీపట్నం డిపో మేనేజర్ ఎం.ఎస్‌.ఎస్‌. ధీరజ్, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, వార్డు ఇంచార్జ్ లు పాల్గొన్నారు.

PALLA GOVINDARAO

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :