Rapid TV - Andhra Pradesh / Anakapally : జాతిపిత మహాత్మా గాంధీ 155 వ జయంతి సందర్భంగా అనకాపల్లి జీవీఎంసీ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ గాంధీ గారి సత్యము, అహింసలను స్ఫూర్తిగా తీసుకొని మనమందరమా జాతి మనుగడకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ వి నాయుడు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Rapid TV