Thursday, 30 July 2026 10:14:44 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

రూ.10 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్న రూరల్ సర్కిల్ పోలీసులు.. ముగ్గురి అరెస్ట్.

Date : 08 May 2025 10:23 PM Views : 221

Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV, నర్సీపట్నం : రైస్ పుల్లింగ్ కాయిన్ పేరుతో ప్రజలను బురిడీ కొట్టిస్తూ, నకిలీ నోట్లతో అమాయకులను వంచిస్తున్న ముగ్గురు వ్యక్తులను నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ ఆధ్వర్యంలో రూరల్ సర్కిల్ పోలీసులు గురువారం అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.10 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం సాయంత్రం రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ రేవతమ్మ వివరాలు వెల్లడించారు. నర్సీపట్నం డి.ఎస్.పి ఆధ్వర్యంలో రూరల్ సీఐ కు వచ్చిన నమ్మకమైన సమాచారంతో, నర్సీపట్నం రూరల్ ఎస్సై పి రాజారావు, గొలుగొండ ఎస్సై రామారావు మరియు సిబ్బంది స్థానిక నెల్లిమెట్ట జంక్షన్ సమీపంలోని బుచ్చంపేట వైపు వెళ్లే రహదారిలోని రాతి పణుకు వద్ద దాడి నిర్వహించారన్నారు. ఈ దాడి సమయంలో ఆ ప్రదేశంలో ఏపీ 39 ఈ డబ్ల్యు 9681 నంబరు గల సుజుకి సెలెరియో కారు నిలిపి ఉంచి ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారన్నారు. పోలీసులను చూచి అందులో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారని, విజయనగరం ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్దనుండి రూ.2 లక్షల 60 వేలు అసలు నోట్లను, రూ 10 లక్షల విలువ గల నకిలీ నోట్లను, ఒక సుజుకి సెలోరియ కారు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, పరారైన వ్యక్తుల కోసం గాలిస్తున్నామని, మరికొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉందని రూరల్ సీఐ రేవతమ్మ వెల్లడించారు. ఈ సమావేశంలో రూరల్ ఎస్సై పి రాజారావు, గొలుగొండ ఎస్సై రామారావు, సిబ్బంది పాల్గొన్నారు.

PALLA GOVINDARAO

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: