Saturday, 13 June 2026 06:27:59 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటండి, వాటిని సంరక్షించండి:: స్పీకర్ అయ్యన్న పాత్రుడు

Date : 30 August 2024 03:50 PM Views : 166

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ:: మొక్కను నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలి:: రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యపాత్రుడు అనకాపల్లి ఆగష్టు 30: ప్రతి ఒక్కరూ కనీసం మూడు మొక్కలను నాటాలని, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యపాత్రుడు అన్నారు. వనమహోత్సవం-2024 కార్యక్రమం సందర్భంగా శుక్రవారం ఉదయం అనకాపల్లి స్థానిక డాక్టర్ ఎన్టీ రామారావు మార్కెట్ యార్డ్ నందు మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ఈ సందర్బంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో 60 లక్షల మొక్కలు నాటినట్టు అధికారులు చెబుతున్నారని, క్షేత్రస్థాయిలో చూస్తే దీనికి భిన్నమైన పరిస్థితులుంటున్నాయన్నారు. గతంలో తాను అటవీ మంత్రిగా ఉన్న సమయంలో రెడ్ క్రాస్, గ్రీన్ క్రాప్, ఎన్సీసీ వంటి విద్యార్థి విభాగాలతో ప్రత్యేకంగా ఒకే రొజు లక్షల మొక్కలు నాటేలా చర్యలు తీసుకునేవారమన్నారు. ప్రస్తుతం వాటన్నింటినీ పటిష్టం చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు సూచించారు. జిల్లాలో నాలుగు లక్షల మంది డ్వాక్రా మహిళలను మొక్కల పెంపకంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. శాస్త్రవేత్తలు వద్దని సూచించిన కొన్ని జాతుల మొక్కలను నాటవద్దన్నారు. అన్ని కళాశాలల్లో మొక్కలు పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు వెడల్పు చేసినప్పుడు చెట్లు నరికితే వాటిని తిరిగి పెంచేందుకు ప్రత్యేకంగా రోడ్డు పని బడ్జెట్ లోనే నిధుల కేటాయింపు జరిగేలా అనకాపల్లి జిల్లా నుంచే శ్రీకారం చుట్టాలని కోరారు. వన మహోత్సవంలో భాగంగా మెడిసిన్ ప్లాంట్ తో పాటు వెదురు వనాలు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏడాదికి పది శాతం మొక్కలు పెంచేలా చర్యలు తీసుకుంటే, ఐదేళ్లలో ఆంధ్ర రాష్ట్రం పచ్చగా మారుతుందని పేర్కొన్నారు. ప్రతీ ఒక్క విద్యార్థి వారి ఇంటి పరిసర ప్రాంతాలలో మూడు మొక్కలను నాటి వాటి సంరక్షణ వారే తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.* జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాల 60 లక్షల మొక్కలు నాటామని భవిష్యత్తులో విరివిగా మొక్కలు నాటేందుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. అన్ని స్కూల్స్ లో కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ముందుగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్, శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, సుందరపు విజయ్ కుమార్, డి ఎఫ్ ఓ జగన్నాథ్ సింగ్ లతో కలసి మొక్కలను నాటారు. చివరగా విద్యార్థులకు మొక్కలను పంపిణీ చేసి, ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్, శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, సుందరపు విజయ్ కుమార్, జిల్లా అటవీ శాఖ అధికారి జగన్నాథ్ సింగ్, అటవీ శాఖ అధికారులు, జిల్లా అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :