Rapid TV - Andhra Pradesh / Anakapally : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా జనవరి 23వ తేదీన స్థానిక గవరపాలెం వివి రమణ రైతు భారతీహాలులో రక్తదాన శిబిరం, ఉచిత నేత్ర వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని టిడిపి యువ నాయకుడు దాడి రత్నాకర్ చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి రక్తదాన శిబిరం ప్రారంభమవుతుందని అనకాపల్లి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని అన్నారు. శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి, విశాఖపట్నం రాజా ఆప్టికల్స్ కంటి ఆసుపత్రి అనకాపల్లి వారిచే ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని ఈ ఉచిత కంటి వైద్య సిబ్బంది ద్వారా అవసరం అయిన వారికి కంటి శుక్లాల ఆపరేషన్ ఉచితంగా చేయిస్తామని, అవసరం అయిన వారికి మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని అన్నారు అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Admin
Rapid TV