Rapid TV - Andhra Pradesh / Anakapally : ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాలి.. దాడి కసింకోట మండలం, గొబ్బూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ ల అనకాపల్లి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొణతాల రామకృష్ణ గారితో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ దాడి రత్నాకర్ మరియు సీఎం రమేష్ గారి పుత్రుడు రిత్విక్ గారితో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీరికి ప్రజల నుంచి విశేష ఆదరణ, ఘన స్వాగతం లభించింది. దీనిలో భాగంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో శ్రీ దాడి రత్నాకర్ గారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలలో ప్రస్తుత ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలు జరిగాయని వాటిలో భూ సురక్ష పథకం కూడా ఒకటని అన్నారు. దీనిలో రైతుల యొక్క భూ సర్వే పేరుతో 100 సెంట్లు భూమిని 80 సీట్లకే చూపిస్తూ పట్టా పాస్ పుస్తకాలను మంజూరు చేశారన్నారు. ఆ మిగిలిన 20 సెంట్లు లెక్కలు లేవని ఎవరికి వెళ్తుందో వారికే తెలియాలని అన్నారు. ఈ పాస్ పుస్తకాలపై జగన్ తన బొమ్మను వేసుకొని ప్రచారం చేసుకున్నారని అన్నారు. మన పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ఏంటని ధ్వజమెత్తారు. సంక్షేమం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించలేదని రోడ్ల దగ్గర నుంచి పరిపాలన వరకు అంతా అస్తవ్యస్తముగా తయారైందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Rapid TV