Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ:: జిల్లా పోలీసు కార్యాలయంలో“మొబైల్ రికవరీ మేళా కార్యక్రమం సోమవారం నిర్వహించారు. 7వ విడతలో రికవరీ చేసిన 284 (రూ.32 లక్షల విలువగల) మొబైల్ ఫోన్లను బాధితులకు జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక ఆదేశాల మేరకు డీఎస్పీలు బాధితులకు అందజేశారు. ఇప్పటి వరకు మొత్తం సుమారు 3,300 ఫిర్యాదులు నమోదు కాగా, మొత్తం 7 విడతల్లో 1,930 మొబైల్ ఫోన్ల ను (సుమారు విలువ రూ.2 కోట్ల 77 లక్షల రూపాయలు) పొగోట్టుకున్నవి ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగింది.* ఈ కార్యక్రమంలో ఎస్.బి డీఎస్పీ శ్రీ బి.అప్పారావు, దిశా డీఎస్పీ శ్రీ ఎం.ఉపేంద్ర బాబు, ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్, లక్ష్మణరావు, అప్పలనాయుడు మరియు ఐటీ కోర్ ఎస్సై రఘువర్మ మరియు ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు
Admin
Rapid TV