Saturday, 13 June 2026 06:26:35 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

జనసేన పార్టీకి పరుచూరి రాజీనామా

Date : 15 March 2024 12:52 PM Views : 220

Rapid TV - Andhra Pradesh / Anakapally : జనసేనకు పరుచూరి రాజీనామా అనకాపల్లి .. అనకాపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పరుచూరి భాస్కర్ రావు ఆ పార్టీకి శుక్రవారం రాజీనామా చేశారు . పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ముందుగా ఆత్మీయుల సమావేశంలో రాజీనామాలు ప్రకటించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..తన కు అపాయింట్మెంట్ ఇవ్వాలని కొద్ది రోజులుగా విజయవాడలో ఉండి ప్రయత్నించినప్పటికీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఆ బాధతో ఆ పార్టీకి రాజీనామా చేశానన్నారు ..గత ఐదేళ్లుగా పార్టీని బలోపేతం చేసానన్నారు. తన శ్రమను పార్టీ గుర్తించలేదన్నారు .మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు సీటు కేటాయించడం జరిగిందన్నారు. అయినప్పటికీ పార్టీకి సేవ చేద్దామని అనుకున్నానని గెలుపుకు కృషి చేద్దామని ప్రయత్నించానని కానీ తన వాదన వినేందుకు పార్టీ అధినేత గాని మరొకరు గానీ అందుబాటులో లేకపోవడంతో పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది అన్నారు. ఏ పార్టీలో చేరమని రాజకీయల నుండి తప్పుకుంటున్నానని ప్రకటించారు.. అనేక పార్టీల నుండి ఆహ్వానాలు అందుకున్నప్పటికీ తాను ఆదిశగా వెళ్ళటం లేదన్నారు.. నా అభిమానులు కార్యకర్తలు ఎవరి అభిప్రాయం మేరకు వారు నిర్ణయం తీసుకోవచ్చని తనకు ఇన్నాళ్లు సహకరించిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో కూడా తన సహాయం అందిస్తానని ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తనను సంప్రదించవచ్చని తెలిపారు . ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు నియోజకవర్గ నలుమూలల నుండి విచ్చేశారు. అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :