Thursday, 30 July 2026 09:18:21 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

కూటమి గెలుపుతో అభివృద్ధికి బాటలు... ఎంపీ సీఎం రమేష్

Date : 17 June 2024 07:09 PM Views : 259

Rapid TV - Andhra Pradesh / Anakapally : కూటమి విజయంతో అభివృద్ధికి బాటలు.. ఎంపీ సిఎం రమేష్... అటు దేశంలోనూ,ఇటు రాష్ట్రం లోనూ ఎన్డీయే మిత్రపక్షాలతో కూడిన కూటమి విజయం సాధించి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంతో అభివృద్ధికి బాటలు వేసినట్లయిందని అనకాపల్లి ఎంపీ సిఎం రమేష్ అన్నారు. సోమవారం ఉదయం చోడవరం శివాలయం దగ్గర నిర్వహించిన చోడవరం నియోజకవర్గ ఆత్మీయ సమావేశానికి రమేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ కేంద్రం లోనూ,రాష్ట్రం లోనూ డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలో కి రావడం మూలంగా రాష్ట్రాభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. ఈ ఎన్నికలలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యునిగా తనను, పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల కూటమి అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కూటమి అభ్యర్థుల విజయానికి అహోరాత్రులూ శ్రమించిన టిడిపి,జనసేన, బిజెపి పార్టీల నాయకులకు,కార్యకర్తలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని రమేష్ భావోద్వేగంతో అన్నారు.అందరి సేవలనూ గుర్తు పెట్టుకుంటామని తెలిపారు. చోడవరం నియోజకవర్గ శాసన సభ్యులు కేఎస్ ఎన్ రాజు మాట్లాడుతూ ఈ ఎన్నికలలో తన గెలుపుకు కృషిచేసిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ స్థాయిలో పలుకుబడి కలిగిన సిఎం రమేష్ వంటి వ్యక్తి అనకాపల్లి ఎంపీ గా గెలుపొందడం వలన ఈ ప్రాంతాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందన్నారు.ఈ సందర్భంగా సిఎం రమేష్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు,చోడవరం జనసేన నాయకులు పీఎస్ ఎన్ రాజు..తదితరులు పాల్గొన్నారు

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: