Rapid TV - Andhra Pradesh / Anakapally : చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం గుడివాడ పంచాయతీ పిల్లవానిపాలెం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన పిల్లా కృష్ణ, బర్ణికాల సూర్యనారాయణ లకు చెందిన నీలగిరి తోట దగ్ధమైందని అగ్నిమాపక సిబ్బంది శివ తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు ధూమపానం చేసి అవి అక్కడ పడి వేయడంతో ఈ ప్రమాదం జరిగిందని ఆస్తి నష్టం₹ లక్ష ముప్పై వేలు ఉంటుందని సమాచారం తెలిసిన వెంటనే హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేయడం వల్ల సుమారు ₹ రెండు లక్షల రూపాయల ఆస్తి నష్టాన్ని నివారించగలిగామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది రామ కిషోర్ దిలీప్ సాయి మహేష్ శివ నాయుడు తదితరులు పాల్గొన్నారు
Admin
Rapid TV