Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ న్యూస్ రావికమతం : మండలంలోని కొత్తకోట మేజర్ పంచాయతీ సర్పంచ్ కోన లోవరాజు ఆధ్వర్యంలో ప్రపంచ టాయిలెట్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామస్తులు ప్రజలంతా కూడా పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా పచ్చదనాన్ని అభివృద్ధి పరచాలని అన్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ బహిరంగ మలవిసర్జన మానుకోవాలని మరుగుదొడ్లు ప్రతి ఇంట్లోనూ నిర్మించుకొని వాడుకోవాలని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉంటామని అన్నారు కార్యక్రమంలో ఉప సర్పంచ్ పందల దేవా, ఎంపీటీసీ పూడి దేవా, ఇ ఒ జ్యోతిశ్వర్, ఉపసఫ్యాయులు సత్యన్నారాయణ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Rapid TV