Rapid TV - Andhra Pradesh / Anakapally : మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన మోడీ:: అనకాపల్లిలో బిజెపి సంబరాలు ఎన్డీఏ కూటమి లో మూడవసారి భారత ప్రధానిగా మోడీ గారిని ఎన్నుకోవడం జరిగిన సందర్భంగా అనకాపల్లిలో బిజెపి నాయకులు సంబరాలు చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా రామచంద్ర సినిమా హాల్ వద్దకు వెళ్లి బాణా సంచి కాల్చి ఆ ప్రదేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ సెలబ్రేషన్స్ లో ఓబీసీ సెక్రెటరీ కర్రి రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు వుడా రమేష్, పొలమర శెట్టి నాగేశ్వరావు, అనకాపల్లి మండల అధ్యక్షులు నర్సింగ్ యాదవ్, మారిశెట్టి భాస్కర్ రావు, రూరల్ మండలం అధ్యక్షులు కప్పిరి తాతారావు భారతీయ జనతా పార్టీ పదాధికారులు కార్యకర్తలు యువ మోర్చా జిల్లా సెక్రెటరీ కొండలరావు, గణేష్, గుండా అయ్యప్ప శెట్టి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Admin
Rapid TV