Saturday, 13 June 2026 06:21:16 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

నర్సీపట్నం డిఎస్పి ఆధ్వర్యంలో చెట్టుపల్లిలో మైత్రి సమావేశం

Date : 12 May 2025 10:18 PM Views : 212

Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV నర్సీపట్నం : మండలంలోని చెట్టుపల్లిలో నర్సీపట్నం డిఎస్పీ పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామస్తులతో సోమవారం రాత్రి మైత్రి సమావేశం నిర్వహించారు. రోడ్డు భద్రత, మరియు చట్టాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామ పెద్దలు, సుమారు 200 మంది గ్రామస్తులు, ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలకు ప్రధానంగా వాహనదారుల నిర్లక్ష్యం, మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ఓవర్ లోడింగ్ వంటివి రోడ్డు ప్రమాదాలకు దారితీస్తాయన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబాలు ఎదుర్కొనే నష్టాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. అలాగే భారతీయ కొత్త చట్టాలు, సైబర్ క్రైమ్ వల్ల కలిగే నష్టాలు, గంజాయి రవాణా- నివారణ వంటి అంశాలపై సమగ్రంగా వివరించారు. గ్రామస్తుల సహకారంతో రూరల్ పోలీసుల మైత్రి సమావేశం విజయవంతమైంది. ఈ సమావేశంలో రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ, ఎస్. ఐ పి రాజారావు, సిబ్బంది పాల్గొన్నారు.

PALLA GOVINDARAO

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :