Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎలమంచిలి రాపిడ్ టీవీ:: నూతన ఎస్ఐగా భాధ్యతలు స్వీకరించిన బి నాగేంద్ర రాంబిల్లి ఎస్ఐగా బి నాగేంద్ర బుధవారం భాద్యతలు స్వీకరించారు. ఈయన దేవరపల్లి ఎస్ఐ గా పనిచేస్తూ సాధారణ బదిలీల్లో భాగంగా రాంబిల్లి ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ బి నాగేంద్ర మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తామని, ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తూనే చట్టాన్ని ఉల్లంఘించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తానని, నిషేధిత గుట్కా, గంజాయి విక్రయాల అరికడతామని, దానితో పాటు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, ఈ వ్ టీజింగ్, పాల్పడే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ఆపద సమయంలో డయల్ 100 నెంబర్ కు ఫోన్ చేసి పోలీసుల సహాయాన్ని పొందాలని ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలని ఎస్ఐ తెలిపారు.
Reporter
Rapid TV