Rapid TV - Andhra Pradesh / Anakapally : పిడుగు పడి మేకలు గర్రెలు ఆవు మృతి రాపిడ్ టివి రావికమతం : మండలంలో గురువారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన వర్షానికి పిడుగు పడి 20 మేకలు,గొర్రెలు మూగజీవాలు మృతి చెందాయి. మండల కేంద్రం శెట్టి వారి కల్లాల వద్ద మేత కొరకు మరుపాక, అగ్రహారం గ్రామాలకు చెందిన యాదవులు గొర్రెలను, మేకలను, మేతకు తోలుకు వెళ్లడం జరిగింది. అయితే ప్రమాదవశాత్తు జరిగిన పిడుగు పాటుతో అక్కడకక్కడే మృతి చెందాయి. మరుపాక గ్రామానికి చెందిన సీర సాంబడు, నమ్మి వెంకటస్వామి, సిరా రమణ, దేవర అప్పలనాయుడు, అలాగే కే బి పీ అగ్రహారం గ్రామానికి చెందిన దేవర అప్పారావు లకు చెందిన మేకల, గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెలు మేకలపైనే తమ జీవనం సాగిస్తున్న తమకు ఒక్కసారిగా ఇటువంటి ప్రమాదం వాటిల్లడంతో తమ కుటుంబాలు వీధిన పడ్డాయని పలువురు బాధితులు లబోదిబో మంటున్నారు. .సుమారు 3 లక్షలకు పైగా ఆస్తిన నష్టం వాటిలినట్లు పలువురు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు. చోడవరం శాసనసభ్యులు కె ఎస్ ఎన్ ఎస్ రాజు సంఘటన స్థలానికి చేరుకొని రైతులను పరామర్శించారు. కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.అదేవిదంగా మట్టావాని పాలెయం గ్రామంలో మైచర్ల విశ్వనాథం అనే రైతు యొక్క పశువుల షెడ్డుపై పిడుగు పడటంతో 70వేలు విలువ చేసే ఆవు మృతి చెందింది.
Admin
Rapid TV