Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ న్యూస్: చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పేదవాడికి సొంత ఇల్లు నిర్మాణమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు ల లక్ష్యమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5,98,710 మందికి ఇళ్లు మంజూరు చేసినట్లు తాతయ్య బాబు తెలిపారు. ఎస్సీ 1,57,383 ఎస్టీ 45,766 బీసీ 3,73,204 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. బీసీ, ఎస్సీలకు అదనపు రూ.50వేలు చొప్పున, ఎస్టీలకు రూ.75వేల చొప్పున ఇస్తామన్నారు. గృహ నిర్మాణాల కోసం మొత్తంగా రూ.3,219 కోట్లు అదనంగా ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు యన్ డి ఎ కూటమి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నారు. దిగువ స్థాయి నుంచి పార్టీకి సేవ చేసిన వారికి వారి కుటుంబానికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని పార్టీ అన్నారు.ఆయన తో పాటుగా జిల్లా నాయకులు శిరిగిరిశెట్టి శ్రీరామమూర్తి తదితరులు హాజరయ్యరు
Admin
Rapid TV