Rapid TV - Andhra Pradesh / Anakapally : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పై అనకాపల్లి జిల్లా చోడవరం బార్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ కార్యదర్శి గొర్లె.కృష్ణవేణి విలేకరుల సమావేసం లో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం వలన రైతులకు, ప్రజలకు ఎన్నో సమస్యలు తలెత్తుతాయని. ప్రజల ఆస్తుల పై అభద్రత భావం పెరుగుతుందని, ఈ యాక్ట్ లోపభూయిష్టంగా ఉందని, ఈ యాక్ట్ రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఎన్నో నిరసన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే మాట నిలబెట్టుకుని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ చంద్రబాబు నాయుడు సంతకం చేయడం రాష్ట్ర ప్రజలకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా చోడవరం బార్ అసోసియేషన్ తరపున సిఎం చంద్రబాబు నాయుడు కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో చోడవరం బార్ అసోసియేషన్ కార్యదర్శి గొర్లె.కృష్ణ వేణి, న్యాయవాదులు కొల్లి శ్రీనివాస్, గూనూరు లక్ష్మీ చీపురుపల్లి సూర్య నారాయణ, లక్ష్మీనారాయణ రాజాన సత్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV