Friday, 31 July 2026 08:13:19 AM
# మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్

ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్

Date : 28 July 2024 12:26 AM Views : 515

Rapid TV - Andhra Pradesh / Anakapally : పాయకరావుపేట రాపిడ్ టీవీ, : మండలంలోని పాల్మెన్ పేట గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ మత్స్యకార నాయకులు మైలపల్లి అశోక్ చక్రవర్తి కుమారుడు అద్విత్ ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ లో సత్తా చాటాడు. ఒలింపియాడ్ ఛాంపియన్ పిటి ఉష ఆధ్వర్యంలో భారతదేశ నెంబర్ వన్ "ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్ " నిర్వహించిన ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ (ఐఎంఒ) కాంపిటీషన్ లో అద్విత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొదటి రౌండ్ లో 48 వ ర్యాంకు, రెండవ రౌండులో 135 వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. ఇదే సమయంలో అద్విత్ చదరంగం పోటీల్లోనూ జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరుస్తూ పలువురి మన్ననలు అందుకుంటున్నాడు. అద్విత్ ప్రస్తుతం రాజమండ్రి భోది ఇంటర్నేషనల్ స్కూల్ లో సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. అద్విత్ తల్లి మాలతి రాజమండ్రిలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తుండగా, తండ్రి మైలపల్లి అశోక్ చక్రవర్తి పాయకరావుపేట మండలంలో మత్స్యకార నాయకులుగా పని చేస్తున్నారు. పిన్న వయస్సులోనే మాథ్స్ ఒలింపియాడ్, చదరంగం పోటీల్లో ప్రతిభ కనబరుస్తోన్న అద్విత్ ను పాఠశాల అధ్యాపకులు, పలువురు ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు అభినందించారు.

B.V.V. SATYANARAYANA S. RAYAVARAM

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: