Thursday, 30 July 2026 10:57:41 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

కేడీపేట ప్రాంతంలో పోలీసుల నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం

Date : 15 June 2025 06:06 AM Views : 296

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి నర్సీపట్నం : నర్సీపట్నం రూరల్ సి ఐ ఎల్ రేవతమ్మ , కేడీపేట ఎస్సై తారకేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం సిహెచ్ నాగాపురంలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని సిహెచ్ నాగాపురం, పల్లావూరు, గ్రామస్తులు, భారీగా మహిళలతో పాతకృష్ణదేవిపేట వరకు గంజాయి నిర్మూలన అవగాహన ర్యాలీ (వాక్ తాన్ ) నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ రేవతమ్మ మాట్లాడుతూ, గంజాయి సేవనం, గంజాయి అక్రమ రవాణా వలన కేసులు ఎదుర్కొని జైలుకెళ్లడం వలన ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయన్నారు. అధిక ప్రభావం కలిగిన కేసులలో పిడి యాక్ట్ పెట్టి ఆస్తులు కూడా జప్తు చేయడం జరుగుతుందన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, కుటుంబ యజమాని మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా గృహిణులు ముఖ్యపాత్ర పోషించాలన్నారు. అంతేకాక సైబర్ మోసాలపై జాగ్రత్తలు, మహిళలపై జరిగే నేరాలు, నివారించే మార్గాలు, బాలలపై అఘాయిత్యాలు ( ఫోక్సో చట్టం ) తదితర అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణదేవిపేట, గొలుగొండ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

PALLA GOVINDARAO

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :