Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవి రావికమతం: తన హక్కు అనుభవం కలిగిన పిత్రార్జిత భూమికి పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయాలని పలుమార్లు దరఖాస్తు చేసిన కొట్నాపల్లి విఆర్ఓ లావణ్య స్పందించకపోవడంపై జిల్లా కలెక్టర్కు గిరిజనుడు ఆసరి అప్పారావు సోమవారం స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆసరి అప్పారావు మాట్లాడుతూ తన తండ్రి కనకం దొర తన వాటాగా ఇచ్చిన భూమికి గతంలో ఖాతా నెంబరు 448 సర్వే నెంబర్ 39/4 లో పట్టాదారు పాస్ పుస్తకం ఉండేదని రీసర్వే లో ఆ భూమి వేరే వారి పేరున ఉండడంతో మ్యూటే షన్ చేసి కొత్త పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలని పలుమార్లు ఫిర్యాదు చేసి ఉన్నానని దరఖాస్తు చేసినప్పటికీ కూడా వీఆర్వో లావణ్య పట్టించుకోలేదని ఆమెపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని పట్టాదార్ పాస్ పుస్తకం మంజూరు చేయాలని సోమవారం కలెక్టర్కు స్పందనలో ఫిర్యాదు చేశానని అప్పారావు తెలిపారు.
Admin
Rapid TV