Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV, నర్సీపట్నం : నర్సీపట్నం రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలోని పాత నేరస్తులకు రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ ఆధ్వర్యంలో శనివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరస్తులు గత ప్రవర్తన మార్చుకొని, సత్ప్రవర్తనతో మెలిగేలా కౌన్సిలింగ్ నిర్వహించబడిందని సీఐ తెలిపారు. ఈ సందర్భంగా వారితో సిఐ మాట్లాడుతూ, నేరాలకు దూరంగా ఉండి, చట్టాన్ని గౌరవిస్తూ, సమాజంలో మంచి పౌరులుగా నూతన జీవితానికి బాటలు వేసుకోవాలని సూచించారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి స్వయం ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ పథకాలు వివరించి వారిలో మానసిక ధైర్యాన్ని కల్పించారు. పాత నేరస్తులలో మంచి మార్పు తీసుకురావడమే ప్రధాన ఉద్దేశం గా ఈ కౌన్సిలింగ్ నిర్వహించామని సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై పి రాజారావు, సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Rapid TV