Thursday, 30 July 2026 08:27:13 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

జగనన్న ఆరోగ్య సురక్ష 2ను ప్రారంభించిన అనకాపల్లి ఎంపీపీ గొర్లి సూరిబాబు

Date : 19 January 2024 01:46 PM Views : 320

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి మండలం రేబాక ఎంపీయుపీ పాఠశాలలో శుక్రవారం ఏర్పాటుచేసిన జగనన్న ఆరోగ్య సురక్ష 2ను ముఖ్య అతిథి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గొర్లి సూరిబాబు ప్రారంభించారు. గతంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష మొదటి విడత విజయవంతం అయిందని ఈరోజు రెండవ విడత జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభించామని ఆయన అన్నారు దీని ద్వారా గ్రామంలో ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులోకి వస్తుందని వైద్య నిపుణులచే ప్రతి జబ్బుకి ప్రత్యేక చికిత్స ఉంటుందని తెలిపారు. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పేదవాడి ఆరోగ్యం మెరుగవుతుందని ఖరీదైన వైద్యం పేదవారికి ఉచితంగా లభిస్తుందని అన్నారు. పేదవాడిని దృష్టిలో ఉంచుకొని ఇటువంటి పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎంపీపీ గొర్లి సూరిబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష లో ఏర్పాటు చేసిన రక్తహీనత ఉన్న పిల్లలు, గర్భిణీల పట్టికను పరిశీలించారు, ఎంపీపీ గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మార్టూరు సన్యాసమ్మ ఎంపీటీసీ మంత్రి సంతోషం, మార్టూరు భాస్కరరావు, మంత్రి సత్యనారాయణ, సచివాలయం కన్వీనర్ కోనా కిషోర్ కుమార్, ఎంపీడీవో కే నరసింహారావు, కే ధర్మారావు, స్పెషలిస్ట్ డాక్టర్లు, గ్రామ కార్యదర్శులు, అంగన్వాడి సూపర్వైజర్లు వాలంటీర్లు, హెల్త్ సూపర్వైజర్లు సచివాలయం సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :