Rapid TV - Andhra Pradesh / Anakapally : నక్కపల్లి : నక్కపల్లి మండలం టోల్ ప్లాజా వద్ద భారీగా నగదు.పట్టుబడింది. వాహనాల తనిఖీల్లో భాగంగా ఓ కారులో నగదు ను నక్కపల్లి పోలీసులు. గుర్తించారు.ఈ నగదు మొత్తం సుమారు 2కోట్ల 7 లక్షల 50 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు..నాలుగు బ్యాగులు,ఒక గోనె సంచిలో నగదు తీసుకువెళ్తున్నట్లు గుర్తించామని పోలీసులు చెబుతున్నారు. రాజమండ్రి నుండి విశాఖ వైపు వెళ్తున్న కారులో ఈ నగదు లభ్యం అయినట్లు తెలుస్తోంది. నగదు తీసుకువెళ్తున్న వాహన దారుడు సరైన ఆధారాలు చూపించలేదని నక్కపల్లి ఎస్.ఐ విభూషణరావు. చెబుతున్నారు.నక్కపల్లి పోలీసులు వాహనాన్ని ,నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.అప్పన్న మాట్లాడుతూ ప్రతిరోజూ చేస్తున్న డైనమిక్ తనిఖీల్లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ కారులో 2 కోట్ల 7 లక్షల 50 వేల రూపాయల నగదు తీసుకువెళ్తున్నట్లు గుర్తించామని తెలిపారు.ఆ నగదు కి ఎటువంటి ఆధారాలు చూపించక పోవడంతో ఆ కారును ,నగదు ని సీజ్ చేశామన్నారు.
Admin
Rapid TV