Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి చీడికాడ : మండలంలోని చీడిపల్లి పంచాయతీ లో శుక్రవారం ఉపాధి హామీ కూలీలు పెండింగ్ లో ఉన్న బిల్లులు చేల్లించాలని నోట్లో గడ్డి పెట్టుకొని వినూత్న రీతిలో అందోళన చేసారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ చాలాకారంగా ఉపాధి కూలీలకు కూలి చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూలి పని చేసి ఏమి తిని బతకాలని గడ్డి నోట్లో పెట్టుకుని నిరసన తెలుపుతున్నామన్నారు. వీరికి మద్దతుగా జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకన్న పాల్గొన్నారు తక్షణమే ప్రభుత్వం స్పందించి బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలిపారు.
Admin
Rapid TV