Saturday, 13 June 2026 06:20:34 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

అనకాపల్లి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రతిష్టా శతజయంతి ఉత్సవాలు ప్రారంభం

Date : 18 February 2024 11:29 AM Views : 303

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ప్రతిష్ఠా శతజయంతి ఉత్సవాలు.. ఈ సందర్భంగా అనకాపల్లి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆలయ నిర్వాహకులు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు అనకాపల్లి పట్టణంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు ని ప్రతిష్టించి 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 2024 ఫిబ్రవరి 20వ తేదీ భీష్మ ఏకాదశి రోజు 100 సంవత్సరములోకి అడుగుపెడుతున్న శుభసందర్భంగా అనకాపల్లి కన్యకా పరమేశ్వరి దేవస్థాన సంఘం వారు ప్రతిష్ఠా శత జయంతి ఉత్సవాలను ఏర్పాటు చేశారు.. ఫిబ్రవరి 20 భీష్మ ఏకాదశి రోజున 108 మహిళలచే 108 కలశాలతో శోభాయాత్ర తో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.. అనంతరం అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అమ్మవారి ఉత్సవమూర్తి యంత్రములకు కళాశాభిషేకం, విగ్నేశ్వర పూజ, ఆవాచనం, పరిషత్, దీక్షాధారణ నివేదన, తీర్థ ప్రసాద వితరణ మొదలగు కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఫిబ్రవరి 21వ తేదీన నిత్య అర్చన, విశేష ఆరాధన నీరాజనా మంత్రపుష్పములు, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగును. ఫిబ్రవరి 22వ తేదీన నిత్యార్చన, విశేష కుంకుమ పూజ 1008 గాజులతో సహస్ర నామార్చన నీరాజన మంత్రపుష్పములు మొదలగు కార్యక్రమాలు జరుగును. ఫిబ్రవరి 23వ తేదీ పౌర్ణమి సందర్భంగా ఉదయం ఐదున్నర గంటలకు నగర సంకీర్తన, గోపూజ, అమ్మవారికి అభిషేకం, నవకలశ స్నపనము, హోమ కార్యక్రమము, నీరాజన మంత్రపుష్పములు, తీర్థ ప్రసాద వితరణ, ప్రవచనములు మొదలగు కార్యక్రమాలు జరుగును ఈ సంవత్సర కాలం పాటు ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ సంవత్సర కాలం పాటు 52 ఆదివారాలు సూర్య నమస్కారాలు జరిగినయి ఆలయ నిర్వహించారు. ఈ శతసంవత్సర సందర్భంగా ప్రతి పౌర్ణమి నాడు విశేష కార్యక్రమాలు అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు జరుగును. ఈ కార్యక్రమాలు శ్రీమాన్ శ్రీ రేజేటి రామాచార్యులు ఆధ్వర్యంలో జరుగునని ప్రతిష్ఠా శత జయంతి ఉత్సవాల చైర్మన్ కోరుకొండ బుచ్చిరాజు తెలియజేశారు. అనకాపల్లి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నిర్మించి 100 సంవత్సరాలలోకి అడుగు పెట్టిన సందర్భంగా 100 కేజీలతో అమ్మవారికి వెండి రథం తయారుచేసి అమ్మవారి జన్మదినానికి అందుబాటులోకి తీసుకొస్తామని కార్య నిర్వాహకులు తెలియజేశారు. అదేవిధంగా అనకాపల్లి చిన్న వీధిలో ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థాన సంఘం శ్రీ శ్రీ నుదురుపాటి వరహాలు గారి కళ్యాణమండపం పునః నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలియజేశారు. ప్రతి సంవత్సరం విధ్యా వేతనం కింద సుమారు రెండు లక్షల రూపాయలతో విద్యార్థులకు పుస్తకాలు అందజేస్తున్నారు. ప్రతి శుక్రవారం అమ్మవారి ప్రాంగణంలో అన్నదానము జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా అమ్మవారి శత జయంతి ఉత్సవాల కరపత్రాన్ని ఆలయ కమిటీ వారు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బిళ్లపాటి కృష్ణకుమార్, కార్యదర్శి కొరుపోలు జగదీశ్వర్ రావు, కోశాధికారి శ్రీధరాల సోమరాజు, ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పల శ్రీనివాసరావు, ప్రతిస్థా జయంతి ఉత్సవాల చైర్మన్ కోరుకొండ బుచ్చిరాజు, కో చైర్మన్ డా. గ్రంథి శేషు కుమార్, నుదురుపాటి తాతాజీ, గ్రంధి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :