Thursday, 30 July 2026 08:27:16 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

అసెంబ్లీలో గళం వినిపించిన కొణతాల రామకృష్ణ

Date : 23 July 2024 06:12 PM Views : 233

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ :: అసెంబ్లీ లో గళం వినిపించిన కొణతాల రామకృష్ణ అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలు GVMC లో విలీనం అయినప్పటికీ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని అనకాపల్లి శాసనసభ్యుడు కొణతాల రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం అసెంబ్లీలో ఆయన ఈ విషయమై ప్రస్తావించారు ఈ రెండు ప్రాంతాల్లో కనీసం అభివృద్ధిని జీవీఎంసీ పట్టించుకోవడంలేదని అన్నారు, అసలు ఈ రెండు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాయా లేదా అన్న విషయాన్ని అధికారులే మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు అభివృద్ధిలో నిర్లక్ష్యం కనబడుతుందని , కనీస అవసరాలైన డ్రైనేజీ వంటివి కూడా లేకుండా పోయాయని, విశాఖపట్నం నగరంలో మాదిరిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రావాలని కోరారు ఇప్పుడున్న డ్రైనేజీ వ్యవస్థ కొనసాగితే ఎక్కడికక్కడ కనెక్టివిటీ లేక డ్రైనేజీలు పారకపోవడం మూలాన దోమల బెడద కూడా ఎక్కువ అవుతుందని తద్వారా వ్యాధులు కూడా ప్రభలే అవకాశం ఎక్కువ ఉందని గుర్తు చేశారు గత ప్రభుత్వంలో విశాఖపట్నం అనకాపల్లి అలాగే భీమిలి ఈ మూడు ప్రాంతాల్ని కూడా కనెక్ట్ చేస్తూ నిర్మాణం చేయాల్సిన మెట్రో ప్రాజెక్ట్ ని ఏ విధంగా పక్కన పెట్టారో అన్న అంశాలను కూడా సభ దృష్టికి తీసుకువస్తూ త్వరితగతిన వీటిని పూర్తి చేసేందుకు ఒక యాక్షన్ ప్లాన్ ని రూపొందించాలని ప్రభుత్వానికి సూచించారు . మున్సిపల్ డంపింగ్ యార్డ్ అంశాన్ని కూడా లేవనెత్తారు, దేశంలోనే ఎక్కడా కూడా నగరం నడిబొడ్డున మున్సిపల్ ఆఫీసులో డంపింగ్ యార్డ్ అనేది నిర్వహణ ఉండదని ఒక్క అనకాపల్లి లోనే ఇలా ఉందని, వెంటనే దీన్ని తరలించేందుకు చర్యలు చేపట్టి అనకాపల్లి ప్రజలకు మేలు చేయాలని కోరారు

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :