Saturday, 13 June 2026 06:20:35 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

తిరుమల లడ్డు వివాదంలో బాధ్యులను కఠినంగా శిక్షించాలి:: అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్

Date : 20 September 2024 02:07 PM Views : 290

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ:: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడిన విషయం పై తీవ్ర విచారం వ్యక్తం చేసిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీ.ఎం రమేష్ గారు.* *తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్* *లడ్డూ అంశంపై వేగవంతం గా దర్యాప్తు జరగాలి అని రాష్ట్ర ప్రభుత్వమును కోరిన అనకాపల్లి ఎం.పీ.* ప్రపంచవ్యాప్తంగా హిందువులందరు ఎంతో పవిత్రంగా భావించే కలియుగ దైవం తిరుమల శ్రీవారి ఆలయం పవిత్రతను దెబ్బతీసేలా గత వైస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వాడారని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న వెల్లడించిన విషయం మీద అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ సీ.ఎం రమేష్ గారు స్పందించారు.ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయం నుండి పత్రిక ప్రకటన విడుదల చేశారు.తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడిన విషయం పై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఈ అంశం ప్రపంచ నలుమూలల ఉన్న కోట్లాది హిందువులను ఎంతో క్షోభకు గురి చేసింది అన్నారు.2019 నుండి 2024 మధ్య వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో అంతర్వేదిలో రథదగ్ధం , రామతీర్థంలో శ్రీ రాముని విగ్రహ శిరచ్చేదం , హిందూ దేవాలయాల పై దాడులు, విగ్రహాల ధ్వంసం, బలవంత మత మార్పిడులు , ఎటువంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ప్రార్ధన మందిరాలు నిర్మాణం , దేవాలయాల ఆస్తుల ఆక్రమణ ,హిందువుల పండగల పై ఆంక్షలు , తిరుమల , శ్రీశైలం వంటి ప్రముఖ హిందు పుణ్యక్షేత్రాల్లో అన్యమతస్తుల నియామకం, ధార్మికతను దెబ్బతీస్తూ వ్యాపార కార్యకలాపాలు ప్రోత్సహించడం వంటి అనేక హిందూ వ్యతిరేక కార్యకలాపాలు జరిగాయి అని ఆరోపించారు.తిరుమలలో నిత్యం జరిగే అన్నదానంలో నాణ్యతా లోపాలు , దర్సనాల టిక్కెట్లు అమ్మకాలు , సౌకర్యల కల్పన , అభివృద్ధి పేరిటి చేపట్టిన పనుల్లో నిధుల దుర్వినియోగం , టీటీడీ నిధులు మల్లింపు వంటి అనేక వార్తలు మీడియా కథనలులో వచ్చాయి అని ఈ సందర్బంగా గుర్తు చేశారు.గత ప్రభుత్వంలో హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఇటువంటి అసంఖ్యాక సంఘటనలు జరిగిన క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అన్ని అంశాలపై దర్యాప్తు చేసి ,నిందితులను చట్టం ముందుకు తీసుకు వచ్చేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా ఈ అంశం మీద కేంద్రం ద్రుష్టికి తీసుకువెళ్ళాం అని కేంద్ర ఆహారశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారు సైతం లడ్డూ అంశంపై దర్యాప్తు జరగాలి అని ఈ యొక్క ఆరోపణల గురించి పూర్తి స్థాయిలో విచారణ జరగాలని వ్యాఖ్యనించారు అని తెలియజేసారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :