Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ న్యూస్చోడవరం /రావికమతం : రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులు ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని రావికమతం తాసిల్దార్ వెంకటరమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ మండలంలో 52 చౌకధరల దుకాణాలు ఉన్నాయని ఆయా డిపోల పరిధిలో ఇంకా 22,437 రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోలేదని వారంతా తప్పనిసరిగా రేషన్ దుకాణం డీలర్ వద్దకు వెళ్లి ఈపాస్ లో వేలిముద్ర వేసి ఈకేవైసీ చేయించుకోవాలన్నారు. ఈకేవైసీ చేసుకోని కార్డుదారులకు ప్రభుత్వం నుంచి అలాట్మెంట్ ఉండదని అందువలన వాళ్లకు ఏప్రిల్ నుంచి సరుకులు నిలిపివేయబడతాయి అన్నారు. కార్డు దారులు రేషన్ డిపో కి ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టుకొని వెళ్లాలని రేషన్ డీలర్లకు సహకరించి ఈ కేవైసీ చేసుకోవాలని తెలిపారు.
Admin
Rapid TV