Friday, 31 July 2026 10:37:45 AM
# మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్

ఎంపీ సీఎం రమేష్ పుట్టినరోజు సందర్భంగా ఉచిత కంటి పరీక్షలు

Date : 18 February 2025 02:57 PM Views : 429

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ:: అనకాపల్లి పార్లమెంటు సభ్యులు, పార్లమెంటరీ రైల్వే బోర్డు స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్ గారి జన్మదినం సందర్బంగా అనకాపల్లి పట్టణం, విజయరామరాజు పేటలో రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రాస్ట్రాక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ మరియు మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ ఆదేశాల మేరకు 82వ వార్డు టీడీపీ ఇంచార్జీ పొలారపు త్రినాధ్ మరియు 83వ వార్డు టీడీపీ ఇంచార్జీ బొద్దపు ప్రసాద్ గారు సహకారంతో సాయి రాజా వెల్ఫేర్ ట్రస్ట్ అనకాపల్లి, శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి విశాఖపట్నం & రాజా ఆప్టీకల్స్ కంటి ఆసుపత్రి అనకాపల్లి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర , ఎంపీ కార్యాలయం ఇంచార్జీ విజయ్ లు కలిసి ప్రారంభించారు.ఈ వైద్య శిబిరంలో సాయి రాజా వెల్ఫేర్ ట్రస్ట్ కంటి డాక్టర్ పి.అరుణ కంటి పరీక్షలు చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులను పంపిణి చేశారు. ఈ శిబిరంలో 90 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 25 మంది ఆపరేషన్ల కు ఎంపికయ్యారు. 40 మందికి కంటి అద్దాలు అవసరం గుర్తించి వారికి అనకాపల్లి రాజా ఆప్టికల్స్ అండ్ కంటి ఆసుపత్రిలో 50% రాయితీతో కంటి అద్దాలు అందజేస్తామని పూసర్ల రాజా తెలియజేశారు. ఆపరేషన్ అవసరమైన వారికి శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి, విశాఖపట్నం లో ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని రాజా ఆప్టికల్ అండ్ కంటి ఆసుపత్రి అధినేత పూసర్ల రాజా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి శ్రేణులు, గ్రామ కమిటీ పెద్దలు పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :