Rapid TV - Andhra Pradesh / Anakapally : పాయకరావుపేట : గణతంత్ర దినోత్సవ వేడుకలు పాయకరావుపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారుతి నారాయణ చక్రవర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పిసిసి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ జగతా శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్న కార్యక్రమంలో పార్టీ నాయకురాలు సుంకర సూర్యావతి జాతీయ జెండా ను ఎగరవేశారు. జగతా శ్రీనివాస్ మాట్లాడుతూ భవిష్యత్ తరాలు తమ జీవితాలు గౌరవంగా జీవించడానికి ఎందరో మహానుభావులు సాహో పేతమైన పోరాటాలు చేసి మనకు స్వేచ్ఛనిచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్ష అట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మోర్త సింహాచలం, పట్టణ అధ్యక్షుడు పోలవరపు అప్పలరాజు, మద్దూరి సూర్యప్రకాష్, సఖిలేటి దుర్గారావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Rapid TV