Thursday, 30 July 2026 10:54:51 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

నర్సీపట్నంలో వృద్ధురాలిని బెదిరించి 10 తులాల బంగారం చోరీ

Date : 17 May 2025 04:50 PM Views : 252

Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV, నర్సీపట్నం : మున్సిపాలిటీలోని శారదానగర్ లో ఒంటరిగా నివసిస్తున్న ఒక వృద్ధురాలిని గుర్తుతెలియని అగంతకులు బెదిరించి బంగారం ఎత్తుకుపోయిన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శనివారం నర్సీపట్నం పట్టణ సిఐ జి గోవిందరావు అందించిన వివరాల ప్రకారం శారదా నగర్ ఎల్ఐసి బిల్డింగ్ వెనుక వైపు ఆర్ వెంకటలక్ష్మి అనే వృద్ధురాలు చాలా కాలంగా ఒంటరిగా నివసిస్తుందని, ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాదులో ఉంటున్నారని తెలిపారు. శుక్రవారం రాత్రి సుమారు 8:30 గంటల ప్రాంతంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి వెనుక వైపు నుండి ఇంటిలో ప్రవేశించి వృద్ధురాలిని బెదిరించి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు, చేతులకు ఉన్న 8 గాజులు (సుమారు 10 తులాలు )దౌర్జన్యంగా లాక్కొని వెళ్లిపోయారన్నారు. కేసు నమోదు చేశామని క్లూస్ టీం , డాగ్ స్క్వాడ్ టీములు ఆధారాలు సేకరిస్తున్నారన్నారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల పుటేజీలు పరిశీలిస్తున్నామన్నారు. దర్యాప్తు కొనసాగుతుందన్నారు.

PALLA GOVINDARAO

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :