Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV, నర్సీపట్నం : అనకాపల్లి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నర్సీపట్నం రూరల్ సర్కిల్ పరిధిలో గల పాత నేరస్థులకు శనివారం నర్సీపట్నం డి.ఎస్.పి పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. పాత నేరస్తులలో సత్ప్రవర్తన కలిగించే విధంగా ఈ కార్యక్రమం చేపట్టారు. గంజాయి అక్రమ రవాణాకు సహకరిస్తే వారి ఆస్తులు జప్తు చేయబడతాయని, అదేవిధంగా వారి మీద పి డి యాక్ట్ పెడతామని డి.ఎస్.పి హెచ్చరించారు. నేరాలకు దూరంగా ఉండి, చట్టాన్ని గౌరవిస్తూ, సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని సూచించారు. స్వయం ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ పథకాల గురించి వారికి వివరించి, వారిలో మానసిక స్థైర్యం కలిగించారు. పాత నేరస్థులలో మార్పు తీసుకొచ్చే దిశగా పోలీసులు చొరవ తీసుకోవడమే ఈ కౌన్సిలింగ్ ప్రధాన ఉద్దేశం అని డి.ఎస్.పి తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రూరల్ సిఐ ఎల్ రేవతమ్మ, రూరల్ ఎస్ ఐ పి రాజారావు పాల్గొన్నారు.
Reporter
Rapid TV