Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి చోడవరం : జూన్ 4వ తేదీన చోడవరంలో తలపెట్టిన వెన్నుపోటు దినోత్సవ ధర్నాకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి నాయకులు రైతులు ప్రజలు తరలి రావాలని చోడవరం మాజీ శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన చోడవరం వైసీపీ కార్యాలయంలో విలేకరులు సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయినప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని అందుకు నిరసనగా పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఈ సమావేశంలో రావికమతం ఎంపీపీ పైలా రాజు, ముక్కా మహాలక్ష్మి నాయుడు కంచిపాటి జగన్నాథరావు, సీనియర్ వైసీపీ నాకులు వెంపలి ఆనంద్, నియోజకవర్గ 4 మండలాల వైఎస్ఆర్సిపి ముఖ్య నేతలు సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు హాజరయ్యారు
Admin
Rapid TV