Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : అరకు రాపిడ్ టీవీ:: బొర్రా గుహలను కాపాడండి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి విన్నమించిన అరుకు ఎంపీ గుమ్మ తనుజరాణి అరకలోయ నియోజకవర్గ అనంతగిరి మండలంలో సహజ సిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలను కాపాడాలంటు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవును సోమవారం అరకు ఎంపీ గుమ్మ తనూజరాణి పార్లమెంట్లులో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందించారు. బొర్రాగుహలు పై నుంచి రెండో రైల్వే లైన్ వేసేందుకు, రైల్వే శాఖ సన్నాహాలు చేస్తుందని, దింతో బొర్రాగుహలుకు పెనూ ప్రమాదం పొంచి ఉందని కేంద్ర రైల్వే శాఖ మంత్రికి తెలియజేసినట్లు సోమవారం ఫోన్లో విలేకరులకు ఎంపీ చెప్పారు. ఇప్పటికే గుహలు పై నుంచి మొదటి లైన్ ఉందని, ఇప్పుడు రెండో లైన్ వెయ్యడంతో చరిత్ర కలిగిన గుహలను కోల్పోతామని వినతిపత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు. దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రంగా బొర్రాగుహలకు మంచి గుర్తింపు పొంది, ఎంతో ప్రఖ్యాత గాంచిందని, అలాగే ప్రముఖులు సైతం గుహలు అందాలకు మంత్రముగ్దులైనట్లుగా వివరించామని, సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు కూలిపోతే గిరిజనులు మనుగడకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. గుహలపైనే సుమారు వెయ్యి కుటుంబాలు గిరిజనులు ఆధారపడి జీవిస్తున్నారని, విన్నవించామని, గుహలు పై నుంచి రెండో లైన్ వేసే ఆలోచన విరమించుకొని, 40 మీట్లర్ దూరంగా రెండో లైన్ వేసేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్లు ఎంపీ తెలిపారు. దీనిపై స్పందించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ జనరల్ మేనేజర్ తో ఫోన్ మాట్లాడారని, ముందుగా సమస్యను తెలుసుకొన్నరన్నారు. గుహలు పై నుంచి రెండో లైన్ మార్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.
Reporter
Rapid TV