Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : అరకులోయ రాపిడ్ న్యూస్: భారత్ బంద్ విజయవంతం స్వచ్ఛందంగా మూసివేసిన దుకాణాలు ఏ బి సి డి లుగా వర్గీకరించిన ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని కోరుతూ భారత దేశ మాల మహానాడు కమిటీ పిలుపునిచ్చిన భారత్ బంద్ బుధవారం అరకులోయ లో ప్రశాంతంగా జరిగింది . భారత్ బంద్ లో భాగంగా అరకులోయ మాల మహానాడు కమిటీ నాయకుడు జె కె రత్నరాజు ఆధ్వర్యంలో నాయకులు ర్యాలీ నిర్వహించారు. అలాగే భారత్ బంద్ కారణంగా అరకులోయ లో దుకాణాలు మూతపడ్డాయి. ఈ సందర్భంగా రత్న రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ ఉపసహరించుకోవాలన్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణ తీర్పును సుప్రీంకోర్టు పునః పరిశీలించాలని కోరారు. అంతకు ముందు స్థానిక నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు అరకులోయ కమిటీ నాయకులు లెనిన్ రాజు, పైడి రాజు , మద్దిరాల కిరణ్ కుమార్, చంద్రశేఖర్ ప్రసాద్ , తిరుగుళ్ల చంద్ర రావు, దిడ్ల రాజేంద్రప్రసాద్, కొల్లా బత్తుల రవికుమార్, ఏలూరి నవీన్ కిరణ్, దాసరి లక్ష్మణ్, కోరాడ రమేష్, చేరికూరి మోజెస్, మంద శ్రీను, ఎం కిరణ్ కుమార్ , బాబి తదితరులు పాల్గొన్నారు .
Reporter
Rapid TV