Rapid TV - Andhra Pradesh / Anakapally : లక్ష కోట్ల రూపాయల మత్తు పదార్ధాల వ్యాపారి సంధ్య అక్వా ఎక్స్‌పోర్ట్స్ యజమానుల్ని ఉరితీయాలి - మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అనకాపల్లిలో తన కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు.. సంధ్య అక్వా ఎక్స్‌పోర్ట్స్ యజమానుల్ని ఉరితీయాలని, మానవత్వం లేని ఈ మృగాలను, వారికి దన్నుగా నిలుస్తున్న రాజకీయ నాయకులను న్యాయస్థానాలు తమ విస్తృత అధికారాలను ఉపయోగించి శిక్షించాలని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన భయంకరమైన మత్తు పదార్ధాలను బ్రెజిల్ నుంచి విశాఖపట్టణానికి తీసుకొచ్చిన కంటైనర్‌ను ఇంటర్‌పోల్ సహాయంతో స్వాధీనం చేసుకున్న సి.బి.ఐ. అధికారులను అభినందిస్తున్నానని చెప్పారు. సి.బి.ఐ. న్యాయమూర్తి సమక్షంలో కొన్ని ప్యాకింగులను తెరిచి వాటిలో కొకైయిన్ ఉన్నట్టు గమనించారని అన్నారు. దూర ప్రాంత జిల్లాల నుంచి వచ్చిన నేరస్థులు విశాఖపట్టణాన్ని నేరాల అడ్డాగా తయారు చేస్తున్నారన్నారు. సి.బి.ఐ. వారు నేర పరిశోధన జాగిలాలను పంపమని కోరినపుడు విశాఖ పోలీస్ కమిషనర్ ఎందుకు వెళ్లారో, సి.బి.ఐ. విచారణలో చొరబడటానికి ఎందుకు ప్రయత్నించారో ప్రశ్నార్ధకంగా ఉందన్నారు. అక్వా కంపెనీ వారు స్వయంగా అక్కడికి హాజరై కంటైయినర్‌ను తెరవకుండా అడ్డుకున్నారంటే వారి వెనుక బలమైన రాజకీయ, పోలీసు యంత్రాంగాలు ఉన్నట్టు అర్ధమవుతోందన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు విశాఖ నుంచి వెళ్లిన మత్తు పదార్ధాలే సమాజాన్ని నాశనం చేస్తున్నాయంటే విశాఖలో కట్టుదిట్టమైన పరిపాలనా వ్యవస్థ లేనట్టుగా రుజువవుతోందని అన్నారు. ఈ లక్ష కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్ధాలు ఎన్నికల్లో అమాయకులైన యువకులకు పంచి ఇచ్చేందుకే అన్న అపోహలు ఉన్నందున ఎన్నికల కమిషన్ వారు కూడ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
Admin
Rapid TV