Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : గిరిజన సమస్యలు పరిష్కరించాలని మంత్రి సంధ్యారాణికి సివేరి దొన్ను దొర వినతి రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అరకు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి సివేరి దొన్ను దొర వినతి పత్రం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ని కోరారు. సోమవారం మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి టిడిపి నాయకులతో కలిసి గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సివేరి దొన్ను దొర గిరిజన సమస్యలను పరిష్కరించాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ని కోరారు. గత 20 ఏళ్లగా ఏజెన్సీలో జిసిసి డ్రైవర్లుగా పని చేస్తున్న వారికి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని, అదేవిధంగా గిరిజన గ్రామాల్లో నెలకొన్న ఇతర సమస్యలను వివరించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని వినతి పత్రం ద్వారా సివేరి దొన్ను దొర కోరారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యా రాణి తో పాటు మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.
Reporter
Rapid TV