Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా, యలమంచిలి నియోజకవర్గం, అచ్చుతాపురం మండలం, ఖాజీపాలెం, జగ్గంపేట గ్రామాలలో ఈరోజు కూటమి అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచారం లో మహిళలు, కార్యకర్తలు అభ్యర్థులు కి బ్రహ్మరధం పట్టారు. మహిళలు హారతులు ఇచ్చి ఆహ్వానించారు. పార్టీ గుర్తు చూపించి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు. 15సంత్సరాలు ఎమ్మెల్యే గా చేసిన కన్నబాబు నియోజకవర్గం లో భూములు ఆక్రమించడం, ప్రశ్నించిన వారిపై దౌర్జన్యఓ చెయ్యడం తప్ప చేసిన అభివృద్ధి ఏమి లేదని అన్నారు.ఈ కార్యక్రమం లో నియోజకవర్గ నాయకులు ప్రగడ నాగేశ్వరావు, నియోజకవర్గ ఇంచార్జ్ఎం పి అభ్యర్థి సోదరదు రాజేష్, టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Rapid TV