Rapid TV - Andhra Pradesh / Anakapally : చోడవరం నియోజకవర్గం లో మారుమూల గ్రామాలు ను ప్రధాన రహదారులకు కలుపుతూ ఉండే రోడ్ల అభివృద్ధికి 8.34 కోట్ల రూపాయల మంజూరు చేసి పనులు ప్రారంభానికి శ్రీకారం చుట్టినట్లుగా చోడవరం శాసనసభ్యులు ప్రభుత్వవిప్ కరణం ధర్మ శ్రీ అన్నారు ఈ సందర్భంగా ఆయన గురువారం రావికమతం మండలంలోని చీమలపాడు పంచాయతీ మారుమూల గిరిజన గ్రామం చలిసింగం కి రహదారి కొరకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్య ఇస్తున్న ముఖ్యమంత్రి కి మేమంతా ఎంతో రుణపడి ఉంటామని ఎన్నో దశాబ్దాల కాలంగా నెరవేరని కల ఈ రోజు నెరవేరుతుందని చలసింగానికి రహదారి ఏర్పాటు చేయడం గిరిజనులకు అదృష్టమని తెలిపారు డోలిమాత లేకుండా రహదారి ఏర్పాటు చేస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఈ రోజు నెరవేరుస్తున్నట్లుగా తెలిపారు. బుచ్చయ్యపేట రవికుమార్ మండలాల రోడ్లకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తెలిపారు, ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వంజరి గంగ రాజు ఎంపీపీ పైలరాజు కంచిపాటి జగన్నాథరావు ముక్కామహాలక్ష్మి నాయుడు గుమ్మడి సత్యదేవ్ తదితరులు పాల్గొన్నారు
Admin
Rapid TV