Rapid TV - Andhra Pradesh / Anakapally : తెలుగుదేశం పార్టీ నుండి పాయకరావుపేట ఎమ్మెల్యేగా గెలుపొందిన వంగలపూడి అనిత బుధవారం హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వేద పండితులు మంత్రి వంగలపూడి అనితకు వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల చంద్రబాబు నాయుడు ఆశీర్వచనాల వల్లనే మంత్రిని అయ్యానని అన్నారు. నన్ను ఆశీర్వదించి గెలిపించిన పాయకరావుపేట ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. నా మీద నమ్మకంతో నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతలను సమర్థవంతంగా, సక్రమంగా పూర్తి చేస్తానని అన్నారు. మహిళల భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. దిశా పోలీస్ స్టేషన్ పేరు మారుస్తామని అన్నారు. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల అన్నింటిపై విచారణ జరిపిస్తానని అన్నారు. 100 రోజుల్లో గంజాయి రవాణా తగ్గేలా చేస్తానని అన్నారు.
Admin
Rapid TV