Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండల పరిధిలో భారీ వర్షాలు తుఫాను కారణంగా రైతులు కూరగాయలు ,తీగజాతి పంటలలో నీరు నిలవ ఉండకుండా చూసుకోవాలని రావికమతం మండల ఉద్యానవన శాఖ అధికారిని భానుపుష్పలీలావతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె సోమవారం మండలంలోని తోటకూరపాలేం తట్టబంద పీ. పొన్నఓలు జెడ్ కొత్తపట్నం చీమలపాడు పంచాయతీలోని రైతుల యొక్క తీగజాతి పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు మొదట్లో నీరు నిలవకుండా చూసుకోవాలని అదేవిధంగా మొక్కల మొదట్లో మూడు గ్రాముల సి ఓ సి ని లీటరు నీటిలో కలిపి పిచికారి చేయడం వలన తెగులు రాకుండా నివారించవచ్చు అని అన్నారు. ఈ సందర్భంగా రైతులకు వేసవి దుక్కులు నుంచి మొక్క దశ తర్వాత వాటిని కాపాడుకునే విధానం పెంచే విధానం గురించి తెలిపారు. ఆమెతో పాటుగా రైతు భరోసా సిబ్బంది పాల్గొన్నారు
Admin
Rapid TV