Thursday, 30 July 2026 10:01:44 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

బినామీ పేర్లతో సీఎం జగన్ సారా వ్యాపారం :: కొణతాల

Date : 23 April 2024 01:24 PM Views : 303

Rapid TV - Andhra Pradesh / Anakapally : బినామీ పేర్లతో సారా వ్యాపారం చేస్తున్న ముఖ్యమంత్రి... ఉపాధి హామీ కూలీలతో కొణతాల భేటీ... మామిడిపాలెం - బవులవాడ గ్రామాలలో కొణతాల పర్యటన... అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలంలో మామిడిపాలెం బవులవాడ గ్రామాల్లో జరిగిన మహాత్మ గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీం కూలీలతో జరిగిన సమావేశంలో కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ తో పాటుగా ఎంపీ అభ్యర్థి సీఎం.రమేష్ తనయుడు రుత్విక్ పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో మండల స్థాయి నాయకులు పలువురు ప్రజలు ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలపై మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా గ్రామ సమస్యలను పరిష్కరించాలని ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులైన కొణతాల రామకృష్ణను , ఎంపీ కుమారుడు రుత్విక్ ను కోరారు.రామకృష్ణ మాట్లాడుతూ ఇప్పుడు మీరు చేస్తున్న పనికి ఆహార పథకం (ఎన్ఆర్ఈజీఎస్) పథకంలో భాగంగా ప్రస్తుతం ఏదైతే 300 రూపాయలు మీకు అందుతుందో దానికి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 400 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని మీ గ్రామాల్లో ముఖ్యంగా త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉందని మన ప్రభుత్వం వచ్చిన వెంటనే సుజల స్రవంతి ప్రాజెక్ట్ పూర్తి చేసుకుంటామని వెంటనే ప్రతి ఇంటికి మంచి నీటి సరఫరా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మద్యపానం నిషేధం అని చెప్పి ఓట్లు అడిగిన ముఖ్యమంత్రి నిషేధం చేయలేదు సరి కదా తనే సొంతంగా బినామీ పేర్లతో అధిక ధరలతో సారా వ్యాపారాలు చేస్తున్నాడని అటువంటి ముఖ్యమంత్రికి మరల ఓటు అడిగే హక్కు లేదని ఎక్కడ చూసినా భూకబ్జాలు , మైనింగ్ వ్యాపారాలే తప్ప అభివృద్ధి లేదని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీ ఆడపిల్లల పెళ్లి సమయంలో లక్ష రూపాయలు పెళ్లి కానుకగా ఇవ్వబడునని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు జిల్లా మొత్తం ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని మరియు కేంద్రం నరేంద్ర మోడీ సహకారంతో సంవత్సరానికి నాలుగు గ్యాస్ సిలిండర్ ఉచితంగా అందిస్తారని తెలియజేశారు.కనుక గాజు గ్లాస్ గుర్తుపై అలాగే కమలం గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :