Thursday, 30 July 2026 08:29:07 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

నేను సిద్ధం.. మీరు సిద్ధమా.. వైసీపీ నాయకులకు సవాల్ విసిరిన సీఎం రమేష్

Date : 23 April 2024 12:27 PM Views : 250

Rapid TV - Andhra Pradesh / Anakapally : నేను సిద్ధం మీరు సిద్ధమా వైసీపీ నాయకులకు సవాల్ విసిరిన సీఎం రమేష్ అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయుచున్న సీఎం రమేష్, వైసీపీ నుంచి అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న బూడి ముత్యాలనాయుడుకు, జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులకు సవాల్ విసిరారు.. సోమవారం అనకాపల్లిలో జరిగిన బూడి ముత్యాల నాయుడు నామినేషన్ కార్యక్రమంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం రమేష్ కు అనకాపల్లి జిల్లా గురించి ఏమి తెలియదని, వీధుల పేర్లు తెలియవని ముత్యాల నాయుడు అన్నాడు. దీనిపై స్పందించిన సీఎం రమేష్ మంగళవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనకాపల్లి గురించి తనకు తెలియదని ముత్యాలనాయుడు ఆరోపించడం ఆస్యాస్పదంగా ఉందని అన్నారు అనకాపల్లి జిల్లాలో పోటీ చేస్తున్న ఏడుగురు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థులు, ఒక వైసిపి ఎంపీ మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులను రమ్మనండి... నేను ఒక్కడినే వస్తా... అనకాపల్లి గ్రామాల గురించి, మండలాల గురించి, ప్రజల గురించి, కుల మతాల గురించి, ప్రజల జీవనోపాధి గురించి, మాట్లాడుకుందాం. అనకాపల్లి కి సంబంధించి ఎన్ని ప్రశ్నలు అయినా మీ అందరూ కలిపి నన్ను అడగండి నేను ఒక్కడినే సమాధానం చెప్తానని దీనికి నేను సిద్ధం... మీరు సిద్ధమా అని సవాలు విసిరారు... అనకాపల్లి జిల్లాకు కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్ని రకాల నిధులు, స్కీములు వస్తున్నాయో అవి ఏ విధంగా అనకాపల్లి లో ఉపయోగించారో దమ్ముంటే తెలియజేయాలని అన్నారు. డిప్యూటీ సీఎం అయిన నీవు అనకాపల్లి జిల్లాకు ఏమి చేసావని, కనీసం ఎమ్మెల్యేలతో ఒక్కసారైనా మీటింగ్ ఏర్పాటు చేసి అనకాపల్లి జిల్లాకు ఏమి కావాలో ఆలోచన చేసావా అని ప్రశ్నించారు.. ఒక డిప్యూటీ సీఎం గా అనకాపల్లి జిల్లాకు ఏమి చేయలేని నీకు నన్ను ప్రశ్నించే అర్హత లేదని అన్నారు ఆంధ్రప్రదేశ్ కు వైసిపి ఎమ్మెల్యేలు గెలిస్తే జగన్ సీఎం అవుతాడని, కూటమి గెలిస్తే చంద్రబాబునాయుడు సీఎం అవుతాడని, కూటమి ఎంపీలు బిజెపి మోడీకి సపోర్ట్ చేస్తారని, వైఎస్ఆర్సిపి ఎంపీ మీరు గెలిస్తే ఎవరికి సపోర్ట్ చేస్తారో మీకు తెలుసా అని ప్రశ్నించారు.. గెలిచిన తర్వాత ఎవరికి సపోర్ట్ చేయాలో కూడా తెలియని అభ్యర్థి ఎంపీగా పోటీ చేస్తున్నారని చేశారు. అనకాపల్లి గురించి చర్చించడానికి నేను ఎప్పుడైనా సిద్ధమే మీ అందరూ ఎప్పుడు సిద్ధమో తెలియజేయాలని పత్రిక ముఖంగా సవాలు ఇస్తున్నారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు పరమేశ్వర రావు, బిజెపి నాయకులు పరుచూరి భాస్కరరావు, టిడిపి నాయకులు తాతబాబు, కోట్ని బాలాజీ తదితరులు పాల్గొన్నారు

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: