Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV, నర్సీపట్నం : గంజాయిని రవాణా చేస్తున్న తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులను నర్సీపట్నం పట్టణ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం పట్టణ సిఐ జి గోవిందరావు విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పట్టణ పరిధిలోని పెద్ద బొడ్డేపల్లి జంక్షన్ వద్ద చోడవరం రోడ్లో పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు తనిఖీ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా బ్యాగుతో తిరుగుతుండగా పట్టణ ఎస్ఐ రమేష్ సిబ్బందితో కలిసి వారి వద్ద నుండి బ్యాగ్ లను తనిఖీ చేయగా ఎనిమిది కేజీల గంజాయి ప్యాకెట్లలో లభించిందని సి ఐ గోవిందరావు తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకుని, తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన కే హరీష్, యు .కన్నన్ లను అరెస్టు చేశామని ఆయన తెలిపారు . వీరిద్దరూ స్నేహితులని, గంజాయి కొనుగోలు చేసి కోయంబత్తూరులో చిన్న చిన్న ప్యాకెట్లలో అమ్మే అలవాటు ఉందని తెలిపారు .వీరిద్దరూ కోయంబత్తూరు నుండి ట్రైన్ లో మూడు రోజుల క్రితం విశాఖపట్నం చేరుకొని చీడికాడ మండలంలో గతంలో గంజాయి అమ్మే వ్యక్తులతో పరిచయం ఉన్న కారణంగా వారి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసుకుని నర్సీపట్నం ప్రాంతానికి వస్తున్నారని తెలిపారు. పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు తనిఖీలలో గంజాయి పట్టుబడటంతో వీరిద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించామని పట్టణ సీఐ గోవిందరావు వెల్లడించారు. ఈ సమావేశంలో పట్టణ సబ్ ఇన్స్పెక్టర్లు జె రమేష్, ఉమామహేశ్వరరావు లు పాల్గొన్నారు.
Reporter
Rapid TV