Friday, 31 July 2026 10:38:37 AM
# మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్

పాడేరు ఘాట్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్

Date : 15 June 2024 09:16 PM Views : 365

Rapid TV - Andhra Pradesh / Anakapally : పాడేరు ఘాట్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించిన ఎంపి సీఎం రమేష్ క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశం…. పాడేరు ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా,పలువురు గాయపడ్డారు. ఎంపి సీఎంరమేష్ అనకాపల్లి పర్యటనలో బాగంగా గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను గాజువాక లో ఉన్న ఆర్కే హాస్పటల్ కు స్వయంగా వెళ్లి పరామర్శించారు .మెరుగైన చికిత్స అందించాలని హాస్పటల్ మెడికల్ అధికారులను ఆదేశించారు. ఎంపి సిఎం రమేష్ మాట్లాడుతూ ఈ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతి చెందిన వారికి ప్రగాఢ సంతాపం ,వారి కుటుంబ సభ్యలకు సానుభూతి తెలియజేసారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా, బుధవారం పాడేరు లో జరిగిన మోదకొండమ్మ ఉత్సవాలకు అనకాపల్లి పార్లమెంట్ పరిధి అచ్యుతాపురానికి చెందిన ఎస్ ఎస్ వి సౌండ్సువారు స్టేజ్ లైటింగ్ , సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. ఉత్సవాల ముగింపు అనంతరం తిరుగు ప్రయాణంలో ఘాట్ రోడ్డులో వీరు ప్రయాణిస్తున్న లారీకి బ్రేక్స్ ఫెయిల్ అవడంతో ఒక్కసారిగా తిరగబడటంతో, దానిపై ప్రయాణిస్తున్న అచ్యుతాపురం,యలమంచిలి, చోడవరం ప్రాంతాలకు చెందిన లైటింగ్ ,సౌండ్ సిస్టమ్ ఏర్పటుకోసం పనిచేస్తున్న దినసరి కార్మికులు లోయలోకి పడిపోయి , వారిపై లైటింగ్,డెకరేషన్ సామాన్లు పడిపోవడంతో, ముగ్గురు చనిపోగా, మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండటం బాధాకరమని అన్నారు.బాధిత కుటుంబ సభ్యులకు తగిన ప్రభుత్వ సహాయం అందే విధంగా కృషి చేస్తానని సిఎం రమేష్ హమీ ఇచ్చారు. ఎంపి సీఎం రమేష్ తో తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి రత్నాకర్ ఉన్నారు

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :