Thursday, 30 July 2026 06:53:36 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

147వరోజు కి చేరుకున్న దళితుల న్యాయ పోరాటం, సంగీభావం తెలిపిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ విజయ్ కుమార్

Date : 27 June 2026 05:16 PM Views : 9

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా యలమంచిలి : రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో డి-పట్టా భూములను వెనక్కి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ దళిత రైతులు చేపట్టిన ఆందోళన శనివారంతో 147వ రోజుకు చేరుకుంది. ఈ ఆందోళనకు మాజీ ఐఏఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి.ఎస్.ఆర్.కె.ఆర్. విజయ్ కుమార్ మద్దతు ప్రకటించి నిరసన శిబిరాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1978లో 44 ఎకరాల భూమిని భూమిలేని ఎస్సీ నిరుపేదలకు అసైన్‌మెంట్‌గా ఇచ్చారని, లబ్ధిదారులు దాదాపు 47 ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. అలాంటి భూములను ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా రిజంప్షన్ చేయడం చట్టవిరుద్ధమని ఆరోపించారు. నోటీసులు ఇచ్చినట్లు రికార్డులు సృష్టించి భూములను వెనక్కి తీసుకున్నారని, దీనిలో రాజకీయ జోక్యం ఉందని రైతులు చెబుతున్న విషయాలను ప్రభుత్వం విచారించాలని కోరారు. ఆర్ అండ్ ఆర్ కాలనీ పేరుతో భూములు స్వాధీనం చేసుకుని, వాస్తవానికి అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు మార్గం సుగమం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. రైతులపై వేధింపులు నిలిపివేయాలని, ఇప్పటికే జారీ చేసిన రిజంప్షన్ ఆదేశాలను రద్దు చేసి 44 ఎకరాల భూమిని రైతులకు తిరిగి అప్పగించాలని కోరారు. అలాగే, రైతులు నిజంగా భూమిని సాగు చేయడం లేదని ప్రభుత్వం భావిస్తే, వారికి తగిన గడువు ఇచ్చి చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రైతుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Ramanarao yelamanchili

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: