Saturday, 13 June 2026 06:27:17 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవాలని కేంద్రమంత్రి కుమారస్వామి కోరిన పురందేశ్వరి

సానుకూలంగా స్పందించిన కుమారస్వామి

Date : 26 June 2024 06:56 PM Views : 342

Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి, రాపిడ్ టీవీ:: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలో పెట్టేందుకు కేంద్ర మంత్రి తో చర్చలు జరిపిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి కుమార స్వామి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలోకి తీసుకుని వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ బిజెపి శాఖ నడుంకట్టింది. ఢిల్లీలో ఎపి బిజెపి పావులు కదిపింది. అందులో భాగంగా ఒక యాక్షన్ ప్లాన్ ను తయారు చేసి కేబినెట్ మంత్రి కుమార స్వామి తో ఢిల్లీలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నాయకత్వంలో బిజెపి ప్రతినిధి బృందం బుధవారం సమావేశమైంది. గతంలో ఇచ్చిన వినతలు ఆధారంగా కుమార స్వామి అధికార యంత్రాంగంతో చర్చలు జరిపిన విషయాన్ని కుమార స్వామి బిజెపి నేతలకు వివరించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అనే ఉద్యమంలో నుండి వచ్చిన ఒక భారీ పరిశ్రమ అందువల్ల ఆంధ్రుల సెంటిమెంట్ ను గౌరవ విస్తు నిర్ణయం ఉండాలన్న విషయాన్ని మంత్రి వద్ద ప్రస్తావిస్తు స్టీల్ ప్లాంట్ ను సమర్ధవంతంగా నిర్వహిస్తు లాభాల బాటలో కి తీసుకుని వచ్చే కోణంలో మాత్రమే విధానాలు ఉండాలన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావనకు తెస్తు కేంద్రమంత్రి కుమార స్వామి తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు .స్టీల్ ప్లాంట్ ను పూర్వ వైభవం తీసుకుని వచ్చేందుకు అవసరమైన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కుమార స్వామి సానుకూలంగా స్పందిస్తు అధికారులతో కూలంకుషంగా చర్చలు జరిపిన తరువాత ఇదేవిషయం పై రెండుమాసాల్లో మరోమారు ఇదేవిధంగా ఒక సమావేశం నిర్వహించుకుందామని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కి హామీ ఇచ్చారు. ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, అనకాపల్లి బిజెపి ఎంపి సిఎం రమేష్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాధరాజులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక వినతి పత్రాన్ని సమర్పించారు

POOSARLA RAJA ANAKAPALLI

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :